De Aller-Bedste Bøger - over 12 mio. danske og engelske bøger
Levering: 1 - 2 hverdage

Bøger af Dr B Nagaseshu

Filter
Filter
Sorter efterSorter Populære
  • af Dr B Nagaseshu
    158,95 kr.

    ఇరుగు పొరుగు వ్యాస సంపుటిని తీసుకురావడానికి కాస్త ఎక్కువకాలమే తీసుకొన్న మాటవాస్తవం. ఇందులోని వ్యాసాలు నేను వివిధజాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ చేసినవి. మిగిలినవి వివిధ మాసపత్రికల్లో అచ్చయినవి అన్నింటినీ సమకూర్చి మీ ముందుకు తీసుకువస్తున్నాను. సాహిత్యానికి నేను ఒక్కడే కాదు నాకు మాత్రం సాహిత్యం ఒక్కటే పెద్దదిక్కుగా భావిస్తాను. సాహిత్య ప్రపంచానికి నేను కొత్తగా చెప్పేదేముంది అని ఆలోచిస్తే, ఎన్ని విషయాలున్నాయి చెప్పాల్సినవి. ఎంత ఉంది అధ్యయనం చేయడానికి అని అనిపించి నాకు తెలుగుభాష, కన్నడం రెండూ పరిచయం ఉండటంతో నేను భిన్నంగా ఈ తులనాత్మకంగా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. పోలిక అనేది మనం నిత్యంఉపయోగిస్తుంటాం. వ్యక్తినికాని, వస్తువునుకాని, ప్రదేశాన్నికాని, సత్కారంకాని, ఛీత్కారాన్ని కానీ పోల్చడమనేది ముందునుండి వస్తున్నదే. మరి కన్నడ, తెలుగుభాషల్లోనిచాలా విషయాలను అలా పోల్చిచెబితే బాగుంటుంది కదా! అని నాకనిపించి అలా రాయడం మొదలుపెట్టాను. ప్రతిదీ కొనేకి, ప్రతిదీ అమ్మేకి అలవాటు పడ్డ మనం లాభాలే ఆలోచిస్తాం, కానీ అమ్మ మనల్ని ఏ లాభంకోసం కనిందో ఆలోచించే స్థితిలో మనం లేము. ఒక తెలుగు వాడిగాపుట్టి భాషకు, తెలుగుజాతికి సేవచేయలేనివాడు, తనకోసం తప్ప దేశానికి పనికిరాడు. ఈ మాట మనం అంటే వాళ్లు మనల్నే పనికిరాని వాళ్లు అని జమకట్టేస్తారు.